శ్రీరెడ్డి చెప్పుతో కొట్టుకుంది….పవన్‌ ఏం తప్పు చేశారు?

తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు ఎదురవుతున్న లైంగిక వేధింపుపై పోరాటం సాగిస్తున్న శ్రీరెడ్డి వీడియో కెమెరాల ముందు తన చెప్పుతో తాను కొట్టుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పి మరీ చెప్పుతో కొట్టుకుంది. ఇంతకూ పవన్‌ అంత తప్పు ఏం చేశారని…?

మూడు రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిచారు. శ్రీరెడ్డి టివి స్టూడియ్లో కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని వ్యాఖ్యానించారు. ఇదే ఆమెకు కోపం తెప్పిస్తోంది. ఆమె కోపంలో అర్థముంది. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సినిమా నటుడు మాత్రమే కాదు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు. తీవ్రమైన సమస్యపై శ్రీరెడ్డి పోరాడుతుంటే…పార్టీ అధినేతగా ఆయన ఆమెకు అండగా నిలబడాలి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే శక్తి ఆమెకు లేకుంటే…ఆయనో, ఆయన పార్టీ నాయకులో ఆమెను అక్కడి దాకా తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాలి. అంతేగానీ…అన్యాపదేశంగా, ఎద్దేవా చేస్తున్నట్లు ‘స్టూడియోల్లో కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు’ అని మాట్లాడటం సంబంజనం కాదు.

శ్రీరెడ్డి లెవతెత్తుతున్న అంశాలపై తెలుగు సినీ పరిశ్రమలోని హీరోలు ఎవరూ మాట్లాడటం లేదు. ఇలాంటి సమయంలో పవన్‌ స్పందించారు. అక్కడిదాకా ఆయన్ను అభినందించాలి. అయితే…ఆయన స్పందన సరిపోదు. రాజకీయ నాయకుడిగా అసలు సరిపోదు. ఆమె ఆరోపణలు చేస్తున్నది బడాబడా వ్యక్తులపైన. ఆమె ఒంటరిగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించేవాళ్లు ఉండరు. అదే వపన్‌ వంటి వ్యక్తి తోడుగా వెళితే…దానికి వచ్చే స్పందన వేరు. అందుకే శ్రీరెడ్డి పవన్‌పై కోప్పడుతూ….’నేను నిన్న పవన్‌ అన్నయ్యా….అని పిలిచాను…అందుకే…’ అంటూ తన కాలిచెప్పు తీసుకుని చెంపపైన కొట్టుకున్నారు.

ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. చిరంజీవి, రామ్‌చరణ్‌ సినిమాలకు మేజేజర్‌గా వ్యవహరించే వాకాడ అప్పారావుపైన మహిళా ఆర్టిస్టులు లైంగిక వేధింపులకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ విధంగా చూసినపుడు పవన్‌ మరింత బాధ్యతగా మాట్లాడాల్సింది. అవసరమైతే… చిరంజీవిని సంప్రదించి, ఆ వాకాడ అప్పారవు సంగతి ఏమిటో తేల్చాల్సింది. ఇవన్నీ వదిలేసి, మాట కోసం ఒక మాట మాట్లాడినట్లు స్పందించి వెళివ్లపోవడమే పవన్‌ కల్యాణ్‌పై విమర్శలకు ప్రధాన కారణం. దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*