శ్రీవారికి నైవేద్యాలు ఎందుకు తగ్గించారు?

శ్రీవారికి సమర్పించే నైవేద్యాలను రోజురోజుకు తగ్గి చేస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణల్లో ముఖ్యమైనది. ఇలా ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్న. ఒకప్పుడు శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు తయారుచేయించి నైవేద్యంగా సమర్పించేవారు. ఈ ప్రసాదాల గంగాలతో ఆలయం నిండిపోయేది. అయితే ప్రస్తుతం 1 2 రంగాలలో మాత్రమే ప్రసాదాలు నైవేద్యం సమర్పిస్తున్నట్లు చెప్తున్నారు. ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం చేయించాలని పేరుతో స్వామివారికి సమర్పిస్తున్న నైవేద్యాల పరిమాణాన్ని తగ్గించేశారని అర్చకులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న మాట వాస్తవం. ఒకప్పుడు రోజుకు 20000 … 30,000 మంది మాత్రమే స్వామిని దర్శించుకునే వాళ్లు ఇప్పుడు ఆ సంఖ్య 70 వేల నుంచి 70 వేలకు పెరిగింది. సెలవు రోజులు, పర్వదినాలలో లక్షమంది కూడా స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వామివారికి సమర్పించే నైవేద్యాలను భారీగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఒకసారి నైవేద్యం సమర్పించడానికి గంగా లను లోనికి తీసుకెళ్లడం, ఆ తరువాత బయటకు తరలించడానికి దాదాపు అరగంట సమయానికి పైగా పడుతుందని చెబుతున్నారు. ఆ సమయంలో మూడువేలమంది దర్శనం చేసుకునే అవకాశం కోల్పోతారని ఉద్దేశ్యంతో నైవేద్యం రంగాలను తగ్గించారు. దీన్నే రమణదీక్షితులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో రోజుకు ఇంతమందికి దర్శనం చేయించామని గొప్పగా చెప్పుకునే ఎందుకు అధికారులు తపన పడుతుంటారు. ఇది తప్పు కూడా కాదు. అయితే దర్శనం చేయించే పేరుతో ఆలయ సంప్రదాయాలకు, స్వామివారి కైంకర్యాలకు పరిమితులు విధించడమే అసలు సమస్య. రమణదీక్షితులు మరో ఆరోపణ కూడా చేశారు. తోమాలసేవ వంటివి 5 నిమిషాల్లో ముగించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇది కూడా ఎక్కువ మంది భక్తులకు దర్శనం చేయించడానికి అనేది వాస్తవం. గతంలో ఏకాంత సేవకు సుప్రభాత సేవకు మధ్య అరగంట కూడా విరామం ఉండేది కాదు. దీనిపైన విమర్శలు రావడంతో ఇప్పుడు నిర్ణీత సమయానికే ఈ రెండు సేవలు నిర్వహిస్తున్నారు. అయితే మిగిలిన సేవల లో సమయాన్ని విధిస్తున్నారని ఆయన ఆరోపణ. అయితే ఈ మార్పులన్నీ ఆయన ఆమోదంతోనే జరిగాయని ఆలయ వర్గాలు చెబుతున్నారు. అధికారులతో పేదల రావడం వల్ల ఆయన ఇప్పుడు దీన్ని తప్పు పడుతున్నారని చెబుతున్నారు. ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే… నైవేద్యాల కుదింపు, సేవల సమయం తగ్గింపు రమణదీక్షితులు అనుమతితోనే జరిగిందా లేదా అనేది కాదు. అసలు అలాంటి మార్పులు చేశారా లేదా, ఇది సంప్రదాయ సమ్మతమేనా అనేది తేల్చాల్సిన అంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*