శ్రీవారి ఆభరణాలపై బాబు ప్రకటనతోనైనా జ్ఞానోదయం అయ్యేనా..!

శ్రీవారి ఆభరణాలను రెండేళ్లకోసారి జ్యుడీషియల్ విచారణ ద్వారా తనిఖీ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాను ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన నిర్ణయమే. అయితే ఇప్పుడు అటువంటి విచారణ జరిపిస్తారా లేదా అనేది మాత్రం సిఎం చెప్పలేదు. వేల కోట్ల విలువైన శ్రీవారి ఆభరణాలపై రమణ దీక్షితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు. కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ గల్లంతయిందన్న అనుమానాలనూ ఆయన వ్యక్తం చేస్తున్నారు. రమణ దీక్షితులు ఆరోపణలను కొట్టిపారేస్తున్న ప్రభుత్వం విచారణకు ససేమిరా అంటోంది. ఎప్పడో వాద్వా, జగన్నథరావు కమిటీలు విచాఎణ చేశాయని, ఇక విచారణే అవసరం లేదని వాదిస్తూ వచ్చింది. ఆకస్మికంగా చంద్రబాబే స్వయంగా రెండేళ్లకు ఒకసారి ఆభరణాపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తద్వారా భక్తుల్లో విశ్వాసం పాదుగొల్పుతామని అన్నారు.
వాస్తవంగా రమణ దీక్షితులు కోరుతున్నదీ ఇదే. ఎప్పడో చేయించిన విచారణ కాదని, మళ్లీ ఇప్పుడు ఒకసారి ఆ పని చేయాలని అంటున్నారు. పంతానికి పోయిన టిటిడి, ప్రభుత్వం రమణ దీక్షితులుపై దాడి చేయడం మినహా విచారణ చేయిస్తామని మాత్రం చెప్పలేదు. ఆయన కోరినట్లు సిబిఐతో కాకున్నా సిట్టిగ్ జడ్జితోనైనా విచారణ జరిపించివుండాల్సింది. దీనివల్ల ప్రభుత్వ విశ్వసనీయ పెరిగివుండేది. కానీ ఈ అంశాన్ని సానుకూల కోణంలో చూడటం కంటే రాజకీయ దృక్పథం తో చూస్తూ ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. దీక్షితులు పై ఎదురుదాడి వల్ల భక్తుల్లో నమ్మకం కల్పించలేకపోగా అనుమానాలు బలపడటానికి ప్రభుత్వమే కారణమయింది. అదే విధంగా బ్రాహ్మణ సామాజికవర్గంలో టిడిపి పట్ల వ్యతిరేకత పెరగడానికి దోహదపడింది. ఈ నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన చంద్రబాబు రెండేళ్లకొకసారి నగల తనిఖీ చేస్తామని ప్రకటించారు. ఇందులో ఇంకో అంశం కూడా ఉంది. టిటిడిపై ఎంపి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో కేసు వేస్తున్నారు. కోర్టు జోక్యంతో శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాల్సిన అనివార్యత ఏర్పడినా ఏర్పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా విచారణనయ వ్యతిరేకిస్తున్న వారికి బాబు ప్రకటనతో జ్ఞానోదయం అవుతుందని అనుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిట్లు జ్యుడీషియల్ విచారణ ఈ ఏడాదితోనే మొదలుపెట్టడం సమంజసంగా ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*