శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 180004254242 అందుబాటులో ఉంచింది. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ భద్రతా సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండి భక్తుల సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.

బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరాది తదితర పర్వదినాల సమయంలో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంటుంది.

భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు.

గదుల్లో తలెత్తే సమస్యలతోపాటు దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదం, రిసెప్షన్‌, కల్యాణకట్ట, విజిలెన్స్‌, ఆరోగ్య, ఇంజినీరింగ్‌ తదితర విభాగాలకు సంబంధించి భక్తులు ఫిర్యాదు చేసేందుకు ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు 1800425111111.

అదేవిధంగా, టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందిస్తారు. కాల్‌ సెంటర్‌ నంబరు: 0877-2277777, 2233333. వాట్స్‌ యాప్‌ 9399399399, ఈ-మెయిల్‌ : [email protected] ద్వారా భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*