శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత దాడి….జింకను చంపి తిన్న చిరుత

తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో సోమవారం వేకువజామున చిరుత జింకపై దాడికి దిగి చెంపేసిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీనితో కాలినడకన మ్రొక్కులు తీర్చుకునే భక్తులను రెండు గంటల పాటు నిలిపేశారు. నడకమార్గంలో చిరుత సంచారం ఉన్నట్టు తెలిసి సాయంత్రానికి కాలినడకన వచ్చే భక్తులను అనుమతిని నిలిపేశారు. విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలంలో జింక కాళేబరాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రపరిచి తిరిగి భక్తులను అనుమతించారు. చిరుత లేక అడవి కుక్కల దాడికి డిగాయా అనేకోణంలో ఫారెస్ట్ అధికారులు కాలి ముద్రలు సేకరిస్తున్నారు. పోదుగు భాగంలో మొత్తం పీకేయడంతో జింక మృతి చెందిందని అధికారులు మీడియాకు వెల్లడించారు. భక్తులను గుంపులు గుంపులుగా కాలినడకన వెళ్లేలా టిటిడి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*