శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు – భ‌క్తుల‌కు స‌క‌ల ఏర్పాట్లు

కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మూెత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మూెత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వుండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మూెత్సవాలు జరుగనున్నాయి.

బ్రేక్‌ దర్శనాలు, సేవలు రద్దు
– ఈ బ్రహ్మూెత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ దష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. భక్తుల అవసరాలను దష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచారు. వయోవద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ ప్రముకుఖులకు మాత్రమే పరిమితం. గరుడ సేవ రోజులైన సెప్టెంబరు 17, అక్టోబరు 14న బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఇవ్వరు.

పటిష్ట భద్రత
– బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా ముఖ్య కూడళ్లలో సిసిటీవీలు ఏర్పాటు చేశారు. పిఏసి-4లోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో నూతనంగా వీడియోవాల్‌ ఏర్పాటు. దీనిద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు. హోంగార్డులు, ఎన్‌సిసి విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు. బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచడమైనది.

కొత్త నిర్మాణాలకు ప్రారంభోత్సవం
– రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్‌ నూతన భవనాలను బ్రహ్మూెత్సవాల్లో ప్రారంభిస్తారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు నిల్వ ఉంచుకునేందుకు రూ.1.10 కోట్లతో నిర్మించిన నూతన ఉగ్రాణం భవనాన్ని ఈ బ్రహ్మూెత్సవాల్లో ప్రారంభిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండేందుకు రూ.60 లక్షలతో షెడ్డు నిర్మించారు. దీన్ని కూడా ప్రారంభించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు అత్యవసర సమయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉత్తర మాడ వీధిలోని అర్చక భవనం నుండి మేదరమిట్ట వరకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. లక్షలాది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఆకట్లుకునే విద్యుత్‌ దీపాలంకరణలు
– భక్తులను ఆకట్టుకునేలా వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలతో విద్యుద్దీపాలంకరణలు చేశారు. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం, విద్యాసంస్థలు, కల్యాణమండపాలు, బస్టాండు, రైల్వేస్టేషన్‌, అన్ని ముఖ్య కూడళ్లలో స్వాగత ఆర్చిలు, విద్యుద్దీపాల కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శనశాల, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, ఆయుర్వేద కళాశాల, శిల్పకళాశాల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనశాలలు.

పారిశుద్ధ్యానికి పెద్దపీట
– ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా 800 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు సిద్దం చేశారు.

రాత్రి 12 గంటల దాకా అన్నప్రసాద వితరణ
– మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 5 ఫుడ్‌ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందజేస్తారు. భక్తుల కోసం 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్దం చేస్తున్నారు.

11 చోట్ల వైద్య సదుపాయం
– తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 11 ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలో కలిపి 12 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. సీనియర్‌ వైద్యులతో కూడిన బృందం వాహనసేవల్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

3 వేల మంది శ్రీవారిసేవలకులు
– 3 వేల మంది శ్రీవారి సేవకులు, దాదాపు వెయ్యిమంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు. బ్రహ్మూెత్సవాల వాహనసేవల వైభవాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలలో నిపుణులైన పండితుల ద్వారా వ్యాఖ్యానాలు అందిస్తాం.టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మూెత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్‌ సెంటర్‌ నంబరు: 0877-2277777, 2233333. భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా వాట్స్‌ యాప్‌ 9399399399. ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు.

24 గంటలూ ఘాట్‌రోడ్లలో వాహనాల అనుమతి
– బ్రహ్మూెత్సవాల రోజుల్లో 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లను తెరిచి ఉంచడం జరుగుతుంది. తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తగినన్ని ఆర్‌టిసి బస్సుల ఏర్పాటు. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు 24 గంటల పాటు ఉచిత బస్సుల ఏర్పాటు. ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు 8 ప్రాంతాల్లో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు.

గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు
– గరుడసేవ రోజున తిరుమల ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం. అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటు. తిరుపతి – తిరుమల మధ్య 567 బస్సులతో 6,900 ట్రిప్పుల రవాణా సదుపాయం. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లక్షా 75 వేల మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*