సమాచారం ఇవ్వండి…తక్షణమే సమస్య పరిష్కరిస్తా…ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని శ్రీకాళహస్తి ఎంఎల్ఎ బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పారు.

శ్రీరాంనగర్ కాలనీ చివరి భాగంలో సిమెంట్ రోడ్లు లేకపోవడంతో చినుకు పడితే బురదమయంగామారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఇటీవల కాలనీ వాసులు సమస్యను ఎంఎల్ఎ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంఎల్ఎ శుక్రవారం ఉదయం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భగా ముందుగా ప్రజలచేత కొబ్బరి కాయ కొట్టించి పనులను ప్రారంభించారు. అనంతరం ఎంఎల్ఎ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిత్యం కృషి చేస్తానని తెలిపారు. ఏవార్డులో ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే సత్వరమే పరిప్కరిస్తానని చెప్పారు. ప్రజల ఆశీస్సులు వలనే ఎంఎల్ఎ అయ్యానని వారికి సేవచేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, బుజ్జిరెడ్డి, మధురెడ్డి, మున్న, శంకర్ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*