సమాజసేవలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

    సమాజసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని యంగ్ ఎంప్లాయిస్ సోషల్ సర్వీసెస్ కార్యదర్శి మహబూబ్ షరీఫ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఆటోమేటిక్ సైరన్, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్స్ విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య మాట్లాడుతూ మనుషులతో ప్రమేయం లేకుండా గంటగంటకు ఆటోమేటిక్ గా బెల్ కొట్టే సైరన్ పాఠశాలకు విరాళంగా అందించడం సంతోష దాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అప్పలరాజు, రమేష్ కణన్ ,సాయి కిరణ్, నారాయణ, కాశీం పలువురు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*