‘సాక్షి’ సాక్షిగా సంకేతమా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బిజెపితో రహస్య మిత్రత్వం కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో ఎవరు పొత్తుపెట్టుకున్నా రాష్ట్ర ద్రోహులవుతారని ఆ మధ్య చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి మాత్రం తమకు బిజెపితో ఎలాంటి అవగాహన, పొత్తు లేదని చెబుతోంది. అయితే…బిజెపి మాత్రం తమకు వైసిపితో అవగాహన ఉందని ప్రజలకు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయిన సందర్భంగా ‘దేశం పట్ల పెరుగుతున్న నమ్మకం’ అంటూ కేంద్ర ప్రభుత్వం సాక్షి పత్రికకు పూర్తిపేజీ ప్రటన ఇచ్చింది. సాధారణంగా కేంద్రం నుంచి వచ్చే ఇటువంటి ప్రకటనలు ముందుగా ఈనాడులో వచ్చేవి. ఒక్కోసారి రెండు ప్రధాన పత్రికల్లోనూ వచ్చేవి. ఈ ప్రకటన మాత్రం సాక్షిలోనే వచ్చింది. సాక్షి వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి పత్రిక అనేది అందరికీ తెలిసిందే. సాక్షిలో ప్రకటన ఇవ్వడం ద్వారా వైసిపి తమతో ఉందని చెప్పే ప్రయత్నాన్ని బిజెపి చేసిందని అనుకోవాలి. నిజంగానే వైసిపికి బిజెపితో పొత్తువుంటే…. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వైసిపి అధినేత పాదయాత్ర ద్వారా, ఈ నాలుగేళ్లు నిరంతరం ప్రజల్లో ఉండటం ద్వారా సంపాదించుకుంట్లు ఓట్లు బిజెపి వల్ల కోల్పోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల్లో బిజెపిపై కోపం ఉంది. ఆ కోపం వైసిపిపైనా పడుతుంది. అందుకే బిజెపి తగాల్సిన దెబ్బ తనకు తగలకూడదని వైసిపి అనుకుంటే జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*