సామ్రాట్ గడ్డం తీసేశాడు…సునయన జుత్తు కత్తిరించేసింది…గీత టాటూ వేసుకుంది…! బిగ్ బాస్ ఎపిషోడ్ అదిరిపోయింది!!

బిగ్ బాస్ ఇంటి నుంచి ఐదోవారం బయటకు పంపడానికి నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులు…తమకు ఇష్టమైనవి త్యాగాలు చేస్తూ…సెంటిమెట్లు బలోపేతం చేసుకుంటూ…ఒకరిపైన ఇంకొకరు ప్రేమను చాటుకుంటూ…చేసిన పనులు ప్రేక్షకులను అలరించింది. ఇప్పటిదాకా జరిగిన ఎపిషోడ్లలో ఇదో బెస్ట్ ఎపిషోడ్ గా చెప్పవచ్చు.

ఇంటి గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్ ఎర్పాటు చేశారు. బిగ్ బాస్ ఫోన్ చేశారు. ఒకొక్కరుగా ఫోన్ తీశారు. నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే బిగ్ బాస్ సూచింన సభ్యున్ని ఆయన చెప్పిన పని చేశాలా ఒప్పించాలి. లేకుంటే ఫోన్ తీసిన వ్యక్తి నామినేట్ అవుతారు. ముందుగా మొదటి కాల్ ను తేజస్వినీ అందుకున్నారు. ఎప్పడూ గడ్డంతో కనిపించే సామ్రాట్ ను ఒప్పించి గడ్డం, మీసం తీయించుకునేలా చేయాలని చెప్పారు. తేజస్వినీ అడగ్గానే సామ్రాట్ గడ్డం మీసాలు తీసేశారు. ట్రిమ్ చేసుకోవడం మినహా ఇప్పటిదాకా ఎన్నడూ ఇలా షేవ్ చేసుకోలేదని సామ్రాట్ చెప్పడం విశేషం. తనిష్ కోసం దీప్తి సునయన తన పొడవాటి జుత్తును భుజాల దాకా కత్తిరించుకున్నారు. గణేష్ కోసం బాబూ గోగినేని కొత్తిమిర కట్టలు తిన్నారు. బాబుకు కొత్తిమీర అసలు ఇష్టం ఉండదట. కూరలో కొత్తిమీర కనిపిస్తే పక్కన పెట్టేస్తారట. అలాంటిది గణేష్ కోసం పచ్చి కొత్తిమీర తిన్నారు. హమిద్ కోసం రోల్ రైడా తన జుత్తును కట్ చేయించుకుని రెడ్ కలర్ చేసుకున్నారు. బాబు గోగినేని కోసం గేతా మాధురి బిగ్ బాస్ కన్ను లోగోను తన తన చేతిపై శాశ్వతంగా పచ్చ వేయించుకున్నారు. అప్పటికప్పుడు ఓ వ్యక్తి వచ్చి టాటూ వేశారు. ఇంకా గీతా మాధురి కోసం దీప్తి సునయన తనకు ఎంతో ఇష్టమైన తెల్లటి అందమైన దుప్పటిని ముక్కలు ముక్కలుగా చేశారు. నందిని కోసం దీప్తి కాకరకాయ రసం తాగారు. సామ్రాట్ కోసం తనిష్ తనకు ఇష్టమైన లెదర్ జాకెట్ ను పెయింట్ లో ముంచి పాడు చేసుకున్నారు. ఇలా వీరంతా ఈ వారం నామినేషన్ల నుంచి తప్పించుకు న్నారు. దీప్తి, గణేష్, భాను మాత్రం తప్పించుకోలేకపోయారు.

దీప్తికి ఫోన్ వచ్చినపుడు…కౌశల్ ఇక ప్రతివారం తనకుతాను నామినేట్ చేసుకునూలా నందిని ద్వారా ఒప్పించమని చెప్పారు. నందిని అడిగినా కౌశల్ అంగీకరించలేదు. దీంతో దీప్తి నానినేట్ అయ్యారు.

హమీద్ తన తలకు కట్టుకునే గుడ్డను విప్పేయడంతో పాటు ఈ సీజన్ ముగిసేదాకా కెప్టెన్ పదవికి ఎప్పడూ పోటీ పడకుండా ఒప్పించాలని భానుకు టార్గెట్ ఇచ్చారు బిగ్ బాస్. ఆమె చెప్పింది సరిగా వినని హమిద్ వెంటనే ఓకే అనేశారు. శాశ్వతంగా కెప్టెన్సీ వదులుకోవడం మంచిది కాదని మిగతా సభ్యులు చెప్పడంతో పునరాలోచనలో పడిన హమిద్ ముందు ఇచ్చిన హామీని వెనక్కి తీసుకున్నారు. దీంతో హమీద్ ను ఒప్పించలేకపోయిన భాను నామినేట్ అయ్యారు.

ఇక గణేష్ ది దరదృష్టమో ఏమోగానీ సురక్షిత మైన ఆయన చివరిలో నామినేట్ అయ్యారు. రొల్ రైడాను రక్షించడానికి తాను స్వచ్ఛందంగా నామినేట్ అయ్యేందుకు అంగీకరించారు గణేష్. దీంతో గణేష్ ఈ వారం కూడా నామినేట్ అయ్యారు.

ఇదీ ఈ వారం ఎంతో ఆసక్తిదాయకంగా సాగిన బిగ్ బాస్ ఇంటి కథ. ఫోన్ తో కొందరు అనుబంధాలను బలోపేతం చేసుకోగా కొందరు ఉన్న బంధాలను తెంచుకున్నారు…అని బిగ్ బాస్ చివర్లో వ్యాఖ్యానించారు. హమిద్ చేసిన దానికి భాను చాలా బాధ పడింది. కన్నీరు పెట్టుకుంది.‌ ప్రేక్షకుల్లోనూ హమీద్ పైన ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం కొంత దెబ్బ తగిలింది. సురక్షితుడైన తరువాత కూడా నామినేషన్ లో చిక్కుకున్న గణేష్ పైన సానుభూతి పెరిగింది.

ఇక సరదా అంశం ఏమంటే దాదాపు నెల రోజులుగా ఫోన్ కు దూరంగా ఉన్న బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ఇంటిలో ఫోన్ చూడగానే చిన్న పిల్లల్లా అయిపోయారు. రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుని డయల్ టోన్ వింటూ ఆనందించారు. మొత్తంగా టెలిఫొన్ తో నామినేషన్ల ప్రక్రియ నిర్వహించిన తీరు ఆసక్తకరంగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఇంటి సభ్యుల ఇష్టాఇష్టాలను జాగ్రత్తగా గమనించిన బిగ్ బాస్ వాటినే ఈరోజు ఉపయోగిం చుకున్నారు. బాబు గోగినేని ఎప్పడో ఏదో సందర్భంలో తనకు కొత్తిమీర అంటే అసలు ఇష్టముండదని చెప్పారట. ఆ మాటను గమనించిన బాస్…ఆయన్ను కొత్తిమీర తినమని చెప్పారు. సామ్రాట్ ను గడ్డంతీసేయమన్నా, తేజస్వి దుప్పట కత్తిరించమన్నా, సునయను జుత్తు పొట్టిగా చేసుకోమన్నా, హమిద్ ను తల గుడ్డ విప్పేయమన్నా… అన్నీ అటువంటివే. ఎనీ హౌ…కీపిట్ అప్ బిగ్ బాస్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*