సావిత్రి జీవితంలో జెమినీ గణేషన్‌ అంత పెద్ద విలనా!

అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొందిన ‘మహానటి’ సినిమాను చూసి జెమినీ గణేషన్‌ మొదటి భార్య కుమార్తె కమల చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. తన తండ్రి విలన్‌లా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చాలా మంచివారిన, సావిత్రికే ఆయనంటే ఇష్టం లేదని అన్నారు. పాత పత్రికలు తిరగేస్తే…అప్పడు పత్రికల్లో వచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలు వంటివి చూస్తే…జెమిని గణేషన్‌ ‘మహానటి’లో చూపించి నదానికంటే…పెద్ద విలన్‌ అని అర్థమవుతుంది. సావిత్రి మొదటి సంస్మరణ సందర్భంగా సావిత్రి కుమార్తె విజయ చాముండీశ్వరి మాట్లాటిన విషయాలు ప్రచురితమైన ఓ పాత పత్రిక కటింగ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో కనిపిచింది. అందులో ఆమె చెప్పినవి చూస్తే….జెమినీ గణేషన్‌ పాత్రను వివాదాస్పదం చేయడం ఇష్టంలేక, ఆయన పాత్రను కాస్త పాలిస్డ్‌గా చూపించినట్లు అనిపిస్తుంది.

సావిత్రి మొదటి సంస్మరణ రోజు విజయ చాముండి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే…’సావిత్రి చినపోయేనాటికి కటిక పేదరికంగా ఉన్నట్లు వచ్చిన వార్తలనీ అవాస్తం. ఆమె మరణించే సమయానికి రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఆమె వద్ద ఉన్నాయి. ఆమె కోమాలో ఉన్నప్పుడే వీటన్నింటీ కైంకర్యం చేశారు. కొడైకెనాల్‌, హైదరాబాద్‌లోని ఇళ్ల గురించి తెలియకుండా దాచిపెట్టడానికి మా తండ్రి ప్రయత్నిస్తున్నారు. సావిత్రి బతికివుండగా ఆమెను మానసికంగా ఎంతో క్షోభకు గురిచేసినా తండ్రిగా ఆయపై ఉన్న మమకారంతో సర్దుకుపోయాం. ఒక్కోసారి ఆయన పక్షం వహించి అమ్మను క్షోభపెట్టాను. సావిత్రిని కొరడాతో కొట్టి దారిలో పెట్టివుండాల్సిందని జెమినీ గణేషన్‌ మాట్లాడారు. దీన్ని అభిమానులే జీర్ణించుకోలేరు. ఇక కూతురుగా నేను ఎలా తట్టుకోగలను? తల్లిని పోగొట్టుకున్న నన్ను పలకరించడానికి తండ్రి రాలేదన్నారు. తమ్ముడి కోసం ఓ సారి ఇంటికి వెళితే…తీవ్రంగా అవమానించారు. సావిత్రి చనిపోయేనాటికి ఆదాయ పన్ను శాఖకు కట్టాల్సిన రూ.10 లక్షల కోసం అప్పటికి మిగిలివున్న మూడు ఇళ్లనూ గణేషన్‌ ఆటాచ్‌ చేయించి మాకు ఇల్లు లేకుండా చేశారు. ఆమె బాగా సంపాదిస్తున్నప్పుడు హరించినది చాలక….ఆమె కోమాలో ఉండగా లక్షల రూపాయలు కైంకర్యం చేశారు. సావిత్రికి వైద్యం కోసం విరాళాల రూపంలో వచ్చిన డబ్బును కూడా స్వార్థానికి వాడుకున్నారు. సావిత్రి బతికి ఉండగానే…గణేషన్‌ కాశీకి వెళ్లిన సందర్భంగా ఆయన తన తల్లికి తర్పణం వదిలిచ్చారు. తల్లి అస్థికలను నిమజ్జనం చేయడానికి తమ్ముడ్ని పంపడానికి కూడా నిరాకరించారు. ఇక చేసేది లేక నా భర్తతోనే ఆ పని చేయించాను. జెమినీ గణేషన్‌ తన పెద్ద కుమార్తె మెడికల్‌ కాలేజీ చదువు కోసం సావిత్రి తన మెడలోని రవ్వల హారం ఇవ్వలేదన్న కోపంతో పళ్లు ఊడేలా కొట్టారు’ అని ఆమె ఆ రోజు సంతాప సభలో కన్నీటి పర్యంతంగా చెప్పిన మాటలను పత్రికలు ప్రచురించాయి.

ఇదంతా చదువుతుంటే మహానటి టీం జెమినీ గణేషన్‌ గురించి సరిగా అధ్యయనం చేయలేదనిపిస్తోంది. అధ్యయనం చేసినా వివాదాల జోలికి వెళ్లకూడదన్న భావనతో గణేషన్‌ పాత్రను పైపైనే చూపించారనిపిస్తోంది. గణేషన్‌ కుమార్తె కమల తన తండ్రిని విలన్‌లాగా చూపించారని అంటున్నారుగానీ….వాస్తవంగా గణేషన్‌ పాత్రను కూడా పాజిటివ్‌గానే చూపించారు. సావిత్రి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంటే అడ్డుకోడనికి ప్రయత్నించిన వ్యక్తిగా జెమినీ కనిపిస్తారు. చివరిదాకా ఆమెపై ఎనలేని ప్రేమ ఉన్నట్లూ కూడా చూపిస్తారు. సావిత్రి మరణ సమయంలో జరిగిన ఘటనలు (చాముండి చెప్పిన దానిబట్టి) చూస్తుంటే గణేషన్‌ చాలా అమానవీయంగా, బాధ్యతారహితంగా, అవకాశవాదంగా ప్రవర్తించినట్లు తేలుతుంది. గణేషన్‌ పెళ్లి అయిన తరువాత కూడా సావిత్రిని, మరో మహిళను వివాహం చేసుకోవడాన్ని ఓ ఇంటర్వ్యూలో కమలను ప్రశ్నిస్తే…ఆమె నిస్సంకోచంగా సమర్థించారు. తన తండ్రి అందగాడని, అందుకే అందరూ ఆయన వెంటపడ్డారని చెప్పుకొచ్చారు. కమల సినిమా చూసి ఊరకే ఉండివుంటే…సావిత్రి అభిమానులు పాత పత్రికలను తవ్వితీసి వాస్తవాలను బయటపెట్టేవారు కాదు. సినిమాలో చూపించినంత వరకే గణేషన్‌ పాత్ర పరిమితం అయ్యేది. కమల తండ్రి చాలా మంచోడని వెనకేసుకుని రావడం వల్ల వాస్తవాలేమిటో చెప్పే పాత విశేషాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*