సిఎం ప్రెస్ మీట్ కు వెళ్లిన ఆ విలేకరిపై పోలీసు కేసు…ఎందుకో తెలుసా..!!

ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి వెళ్లిన ఓ విలేకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఇతర విలేలరులూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇంతకీ సంగతి ఏమిటంటే….

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి స్థానంలో చివరిసారిగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశానికి సదరు జర్నలిస్టు హాజరయ్యారు.

ఆ తర్వాత ఆ జర్నలిస్టులో కరోనా లక్షణాలు బయటపడటంతో వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు జర్నలిస్టు వివరాలపై ఆరా తీయగా.. లండన్‌ నుంచి వచ్చిన కూతురితో సదరు వ్యక్తి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ సంగతి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*