సినిమా పెద్దల బాగోతాలు…రాంగోపాల్‌ వర్మ చెప్పారు

తెలుగు చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు సంబంధించి ప్రముఖ దర్శకుడు రాంగోల్‌ వర్మ చెప్పిన విశేషాలు విస్మయం కలిగించేలా ఉన్నాయి. లైంగిక వేధింపులపై హీరోయిన్‌ శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిధంగా రాంగోపాల్‌ వర్మ కూడా కొన్ని సంగతులు చెప్పారు. రెండేళ్ల క్రితం ఓ నటి తనకు చెప్పిన విషయాలను వివరించారు. ఆ నటి సినిమాలో అవకాశం కోసం ఓ నిర్మాతను కలిసిందట. అవకాశం ఇవ్వడానికి అంగీకరించిన ఆయన చివర్లో ‘నువ్వు కాంప్రమైజ్‌ కావాలి’ అని అన్నారట. ఆదే విషయాన్ని ఆమె వర్మకు చెప్పిందట. వర్మ నమ్మలేదట. అంత ప్రముఖ వ్యక్తి ఆ విధంగా అంటారు…అని ప్రశ్నించారట. అప్పుడు ఆమె తన ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌చేసి సదరు ప్రముఖ నిర్మాతకు ఫోన్‌చేసి…నిన్న చివర్లో వచ్చేటప్పుడు మీరు ఏదో ‘కాంప్రమైజ్‌ కావాలన్నారు’ ఏమిటిసార్‌ అది అని అడిగిందట. అందుకు ఆయన ‘ఈ విషయం ఈ రోజుల్లో తెలియనిది ఎవరికి అమ్మాయ్‌’ అన్నారట. ‘రెమ్యునరేషన్‌ తక్కువ ఇస్తారా’ అని అడిగిందట. ‘నాకు ఎంతకావాలో అడుగు… దాందేముంది’ అని అవతలవైపు నుంచి అన్నారు. ‘ఒక రోజు మీతో సెక్సువల్‌గా గడపాలని అంటున్నారు’ అని ధైర్యంచేసి అడిగేసిందట. అందుకు ఆ పెద్దమనిషి ‘అన్నీ తెలుసు…మళ్లీ అడుగుతావ్‌’ అన్నారట. అయినా నటీనటులను నిర్ణయించేది డైరెక్టర్లు, హీరోలు కదా…మీరు ఎలా నిర్ణియిస్తారు? అని అడిగితే…’హిరో, డైరెక్టర్‌ను తన్ని ఫీల్డ్‌ నుంచి తరిమేస్తా’ అని అన్నారట. ఆ హీరో, డైరెక్టర్‌ కూడా చాలా ప్రముఖులట. ఈ సంభాషణంతా విన్న రాంగోల్‌వర్మ ఆశ్చర్యపోయారట. అయినా…చాలామంది సినీ పెద్దల బాగోతాలు నటీముణుల సెల్‌ఫోన్లలో భద్రంగా ఉన్నాయట. అవన్నీ బటయకు వస్తే తెలుగు సినీ పరిశ్రమ గగ్గోలేనట. ఇవన్నీ ఓ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు రాంగోపాల్‌ వర్మ. అంటే…ఈ సమస్య తీవ్రమయ్యే కొద్దీ మరికొందరి బాగోతాలు బయటపడతాయన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*