సినీరంగం సమస్యకు రాజకీయ రంగు! జనసేన x వైసిపి

సినిమా రంగానికి సంబంధించి శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్య చిలిచి చిలికి రాజకీయ రంగు పులుముకుని దుమారం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో వేషాలు ఇవ్వడానికి మహిళా నటులను లైంగికంగా వేధిస్తున్నారన్న దీర్ఘకాలిక సమస్యపై శ్రీరెడ్డి ధైర్యంగా పోరాటం ప్రారంభిస్తే…ఆ పోరాటం దారితప్పి ఇప్పుడు రాజకీయ పార్టీ మధ్య విభేదాలకు దారితీస్తోంది. ఇంకా చెప్పాలంటే జనసేన, వైసిపికి మధ్య వివాదంలా మారబోతోంది.

జనసేన అధ్యక్షుడు పనవ్‌ కల్యాణ్‌ను ‘మాదర్‌ చోద్‌ ‘ అంటూ దూషించిన శ్రీరెడ్డి వెనుక వైసిపి కుట్ర ఉందని జనసేన గట్టిగా అభిప్రాయపడుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తానే ఆ మాట అనమన్నానని చెబుతున్నా….దీన్ని పవన్‌ అభిమానులు పెద్దగా నమ్మడం లేదు. వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని తనపైన వేసుకుంటున్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా భావించానికి కారణాలు లేకపోలేదు. శ్రీరెడ్డికి స్నేహితురాలిగా ఉన్న ఓ నటి బంధువు వైసిపిలో ఉన్నారట. అదీగాక శ్రీరెడ్డి మహేష్‌ కత్తితోనూ దగ్గరగా ఉంటున్నారు. మొదటి నుంచి మహేష్‌ కత్తికి పవన్‌ వ్యతిరేకిగా పేరుంది. వైసిపికి అనుకూలంగా ఉంటారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసి….పవన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి వైసిపి ఇవన్నీ చేయిస్తోందని జనసేన అభిప్రాయపడుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే….వర్మ పెద్ద ప్లాన్‌తోనే తనను ఇరికించారని, ఇదంతా వైసిపి కుట్ర అని శ్రీరెడ్డి స్వయంగా తన స్నేహితురాలితో చెప్పిన మాటలు బయటకు వచ్చాయి.

లైంకిక వేధింపుల సమస్యపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని పవన్‌ శ్రీరెడ్డికి సలహా ఇచ్చారు. ఆ రోజు ఆమె ఏమీ మాట్లాడలేదు. తరువాత రోజు దూషిస్తూ మాట్లాడారు. పవన్‌ మహిళా వ్యతిరేకి, మహిళల సమస్యలు పట్టవన్నట్లు ఫోకస్‌ అవుతుందని, ఇది రాజకీయంగా ఆయన్ను దెబ్బతీయడానికి ఉపయోగపడుతుందని… భావించి ఇదంతా చేశారని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ కుట్రకు వర్మకూడా సహకరిస్తున్నారన్నది వారి ఆరోపణ. ఇదిలావుండగా దీనిపై అనివార్యంగా వైసిపి స్పందించింది. శ్రీరెడ్డితో తమకు సంబంధం లేదని….బొత్సా సత్యనారాయణ ప్రకటన చేశారు. ఈ వివాదం ఇంకా పెద్దయ్యే కొద్దీ…ఇతర నాయకులూ మాట్లాడే అవకాశాలున్నాయి. ఈ వివాదం ఇంకా ఎటుదారితీస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*