సినీ న‌టుడు అలీ ఇంట్లో కూర్చుని…. ఏం చేస్తున్నారో తెలుసా..?

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ముఖులు కూడా ఖాళీగా ఇంట్లో్ కూర్చోవాల్సిన ప‌రిస్థితి. ఎంత బిజీగా ఉండేవారైనా గ‌త వారం రోజులుగా ఇంటికే ప‌రిమితమ‌య్యారు. పొద్ద‌పోడానికి ఏదో ఒక‌ప‌ని చేస్తున్నారు. సినీ న‌టుడు, బుల్లితెర యాంక‌ర్ అలీ ఏం చేస్తున్నారో తెలుసా…..ఇల్లు తువ‌డం, కూరగాయ‌లు క‌ట్ చేయ‌డం, కార్లు క‌డ‌గ‌డం వంటి ప‌నులు చేస్తున్నార‌ట‌. అప్పుడ‌ప్పుడు కొంత సేపు టివి చూస్తున్నార‌ట‌. ఈ ఖాళీ స‌మ‌యంలో గ‌త విశేషాల‌ను గుర్తు చేసుకుంటూ….నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు.’ అని త‌న బ్యాచిల‌ర్ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇక మ‌రో హాస్య న‌టుడు, సీనియ‌ర్ న‌టుడు అయిన రాజేంద్ర ప్ర‌సాద్ ఏం చేస్తున్నారో తెలుసా…? ఆయ‌నా వంటిగ‌దిలోకి దూరి వంట‌లు చేస్తున్నార‌ట‌. ఆయ‌న భార్య ఉద‌యం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజ‌నం మాత్రం రాజేంద్ర‌ప్ర‌సాదే చేస్తున్నార‌ట‌. నాకు బోరుగా ఉంది….నేనే చేస్తాను మొర్రో అని భార్య మొత్తుకుంటున్నా వినకుండా న‌ట క‌రిటీ వంటల్లో త‌న ప్రావీణ్య‌మంతా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్‌.. అందుకే ఎక్కువగా అదే చేస్తున్నాను…అని చెబుతున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*