సిబిఐ కొత్త డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు తిరుపతితో లింకు ఏమిటో తెలుసా…!

సిబిఐలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన వివాదా చిలికిచిలికి గాలివానగా మారడంతో, అనూహ్యంగా… అత్యున్నత పదవి అయిన డైరెక్టర్‌ పీఠాన్ని అధిషించిన మన్నెం నాగేశ్వరరావుకు తిరుపతిలోని వ్యక్తులతో బంధుత్వాలున్నాయి. తిరుపతికి చెందిన ప్రముఖ సాహితీవేత్త కోట పురుషోత్తం – నాగేశ్వరరావు వియ్యంకులు. కోట పురుషోత్తం కుమారుడు కీర్తి కిరణ్‌, నాగేశ్వరావు కుమార్తె శ్రీలక్ష్మీ ఆమని వివాహం ఈ ఏడాది ఏప్రిల్‌ 26న జరిగింది. 26.02.2018న చెన్నైలో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం ఫొటోలను కోట పురుషోత్తం తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. నాగేశ్వరావు సిబిఐ డైరెక్టర్‌గా నియమితులైన వెంటనే కోట పురుష్తోం ఫేస్‌బుక్‌ మిత్రులు….పోస్టుల ద్వారా అభినందనలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సిబిఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా, డైరెక్టర్‌ అలోక్‌ వర్మ మధ్య ప్రచ్ఛన్న యుద్దం తలెత్తడంతో ఇద్దర్నీ సెలవుపై పంపి, తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో….రెండు వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. తాత్కాలిక డైరెక్టరుగా నియమితులైన నాగేశ్వరరావు పరిపాలనాపరమైన అంశాలను మాత్రమూ చూడాలని, కీలక నిర్ణయాలేవీ తీసుకోకూడదని కోర్టు షరతులు విధించింది. అలోక్‌ వర్మ కేసులో కోర్టు నిర్ణయం తీరువాత నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టరుగా కొనసాగేదీ లేనిదీ తెలుస్తుంది.

సిబిఐ కొత్త డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావుకు తిరుపతిలోని వ్యక్తులతో బంధుత్వం ఉందన్న వార్త ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కోట పురుషోత్తంకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్లకు మాత్రమే ఆయనకు నాగేశ్వరావుతో ఉన్న బంధుత్వం గురించి తెలుసు. తిరుపతిలో కోట పురుషోత్తం ప్రముఖుడే అయినప్పటికీ…అయన కుమారుని వివాహం గుంటూరులో జరగడంతో ఇక్కడి వారికి అతని వియ్యంకుడైన నాగేశ్వరరావు గురించి పెద్దగా తెలియలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*