సుధాకర్‌ యాదవ్‌ గారూ… రమణదీక్షితులకు గురిపెట్టారు…అది యాదవులను తగులుతుంది!

ఎన్నో ఆటంకాలను ఆధిగమించి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ టిటిడి ఛైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. ఆయన అధ్యక్షతన తొలి ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం (16.05.2018)న జరిగింది. దాదాపు 200 అంశాలను అజెండాలో చేర్చారు. ఇందులో ఎక్కువ భాగం బోర్డు ఉనికిలో లేని ఈ ఏడాది కాలంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయడమే. అయితే ఒక ముఖ్యమైన అంశం మీద మాత్రం చర్చించారు. టిటిడిలో పని చేస్తున్న 65 ఏళ్లు నిండిన అర్చకులకు రిటైర్‌మెంట్‌ ఇచ్చి, ఆ స్థానంలో కొత్తవారిని నియమించుకోవాలన్నది ఆ నిర్ణయం సారాంశం. అర్చకుల రిటైర్‌మెంట్‌, నియామకం సాధారణంగా జరిగే ప్రక్రియలా అనిపించినా…ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం మాత్రం, టిటిడిపై విమర్శలు చేసిన ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను ఇంటికి సాగనంపడమే అనేది సుస్పష్టం.

65 ఏళ్లు దాటిన అర్చకులకు రైటర్‌మెంట్‌ ఇవ్వాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం ఆర్చకులకు మాత్రమే కాదు….శ్రీవారి ఆలయంలో పనిచేసే ‘సన్నిధి గొల్ల’లపైనా పడనుంది. శ్రీవారి ఆలయ తలుపులు తీసేది సన్నిధి గొల్లే. తరతరాలుగా యాదవ వంశీకులే ఈ పని చేస్తున్నారు. అయితే…దీన్ని ఉద్యోగంగా పరిగణిస్తూ రెండేళ్ల క్రితం అప్పుడు సన్నిధి గొల్లగా పనిచేస్తున్న పద్మనాభయ్యను రిటైర్‌ చేశారు. దీనిపైన రాష్ట్ర వ్యాపితంగా యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. అది ఉద్యోగం కాదని, వారసత్వంగా వస్తున్న విధి అని, అలాంటప్పుడు రిటైర్‌మెంట్‌ ఏముంటుందని నిలదీశారు. దీంతో వెనక్కి తగ్గిన టిటిడి సన్నిధి గొల్లను కొనసాగిస్తోంది. సన్నిధి గొల్ల బాధ్యతలను శంపరారంపర్యంగానే కొనసాగించాలన్నది యాదవ సంఘాల అభిప్రాయం. ఎవరో యాదవులను ఆ పనికి నియమించుకుంటామన్నా కుదరదన్నారు. ఏ వంశీకులైతే తరతరాలుగా సేవ చేస్తున్నారో…ఆ శంశీకులనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. టిడిడి దాదాపు అందుకు అంగీకరించింది. దాంతో ఆ వివాదం సద్దుమణిగింది.

ఇప్పుడు అర్చకుల రిటైర్‌మెంట్‌ వ్యవహారంతో సన్నిధి గొల్ల అంశమూ వివాదాస్పదం అవుతోంది. ఆ పోస్టు వంశపారంపర్యంగా వచ్చేది ఏమీ కాదని, ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న పద్మనాభయ్యను రిటైర్‌ చేశామని, అయితే…అవసరాల రీత్యా ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ కొనసాగిస్తున్నామని చెప్పారు. అంటే దీనర్థం ఆ పోస్టులో ఎప్పడైనా కొత్తవారిని నియమించే అధికారం టిటిడికి ఉందన్నట్లు ఈవో చెప్పుకొచ్చారు. మిరాశీ అర్చకులు కోరుతున్నదీ అదే…తాము టిటిడిలో ఉద్యోగులము కాదని, అర్చకత్వం వంశపారంపరంగా సంక్రమిస్తున్న హక్కుగా చెబుతున్నారు. తమను రిటైర్‌మెంట్‌ ఉండదని, వయసురీత్యా పనిచేయలేని స్థితివుంటే…అర్చకత్వానికి అర్హత సంపాదించిన తమ వంశీకులే వస్తారని అంటున్నారు. దీన్ని పట్టించుకోకుండా 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించారు. అంటే సన్నిధి గొల్లనూ వంశపారంపర్యంగా కొనసాగించే అవకాశం లేదని దీనిర్థం.

మొత్తంగా చెప్పకొచ్చేది ఏమంటే…యాదవులకు ప్రతినిధిగా ఛైర్మన్‌గా వచ్చిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తొలి నిర్ఱయం అదే యాదవకులు పోరాడి సాధించుకున్న హక్కును కాలరాసేదిగా ఉంది. అర్చకుల రిటైర్‌మెంట్‌ గురించి ప్రకటిస్తున్నప్పుడు ‘ధర్మచక్రం’ సన్నిధి గొల్ల అంశాన్ని ప్రస్తావించింది. దీనివల్ల సన్నిధి గొల్ల పని కూడా వంశపారంపర్యం నుంచి తొలగిపోతుంది కదా అని అడిగితే…సమాధానం చెప్పడానికి సుధాకర్‌ యాదవ్‌ నీళ్లు నమిలారు. ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌తో సమాధానం చెప్పించారు. ఆయన కూడా అటు తిప్పి ఇటు తిప్పి చెప్పిన సమాధానం ఒక్కటే….సన్నిధి గొల్ల పని చేస్తున్న పద్మనాభయ్య కూడా టిటిడి రిటైర్డ్‌ ఉద్యోగి మాత్రమేనని. ఇప్పుడు ఈ సమస్యను తేల్చుకోవాల్సిన అవసరం యాదవ సంఘాలకు మళ్లీ వచ్చిపడింది.

2 Comments

  1. Yadavakulamlo musalam puttindi we kaliyugamlo kuda, Christian sympathiser nundi inthakanna expect cheyalemu, repu Venkateswara Swamy ki 7kondalu akkaraledu, and churchki permission isthekuda aascharyaponakkaraledu -vijay Kumar advocate tirupati

  2. Being a chief dikshitulu, Ramana garu should have meeting with board members to discusd all the problems rather than going to publicise against the organisation and also violater of aagama procedures. Public doesnt know all the procedures and ethos. He should write and communicate to the concerned authorities whenever such violation is taken place. Being a chief dikshitilu why did not he know about the jwellary as he is serving there for so long. Yes, an appropriate inquiry is must to bring out the facts.

Leave a Reply

Your email address will not be published.


*