సుప్రీం కోర్టులో టిటిడి కేసు విచారణ నేడు…!

శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన వివాదం నేపథ్యంలో బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు సోమవారం విచారణకు రానుంది. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశం గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని, గుప్త నిధుల కోసం స్వామివారి పోటులో తవ్వకాలు జరిపారని, స్వామివారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పురాతన కట్టడం అయినా తిరుమల ఆలయంలో ఇష్టానుసారం మార్పులుచేర్పులు చేస్తున్నారని రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లో ఆయన్ను ప్రధానార్చక పదవి నుంచి తొలగించారు.

ఈ క్రమంలో న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించిన రమణదీక్షితులు ఈ నాయకులను ప్రజా ప్రతినిధులను కలిశారు. స్వతహాగా న్యాయవాది అయిన సుబ్రమణ్య స్వామి స్పందించారు. టీటీడీ ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వంశపారంపర్య అర్చకుల అంశాన్ని ఆయన తన పిటిషన్లో తీసుకొచ్చారు. ఈ కేసు దాఖలు చేసి దాదాపు మూడు నెలలు అవుతోంది.

సుబ్రమణ్య స్వామి దేవాదాయ చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి పటిష్టమైన పిటిషన్ సుప్రీం ముందు ఉంచారు. ఇందులో శ్రీవారి ఆభరణాల భద్రత, పురాతన కట్టడాల నిర్వహణ, అర్చకుల వ్యవహారం తదితర అంశాలున్నాయి. సుప్రీం విచారణ తో వీటన్నింటిపైనా ఒక నిర్దిష్టమైన తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. టీటీడీ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*