సుప్రీం కోర్టు తీర్పు … చంద్రబాబు తెలివైన వక్రీకరణ..!

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధికార పార్టీ వక్రీకరిస్తోందని, తీర్పులో లేనివాటినీ కల్పించి చెబుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సుప్రీం తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయనే వక్రీకరిస్తూ….ఎదుటివాళ్లు వక్రీకరించారని యథేచ్ఛగా చెప్పేశారు.

స్థానిక ఎన్నికల వాయిదాపై విచారణ సందర్భంగా న్యాయమూర్తుల‌ నుంచి ఆసక్తికర వ్యాఖ్యలో చోటుచేసుకున్నాయి. ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదని న్యాయమూర్తులు…ఎన్నికల  సంఘం న్యాయవాదును సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్నికలు వాయిదా వేసినా…కోడ్‌ కొనసాగాని ఎన్నిక సంఘం న్యాయవాది వాదించిన నేపథ్యంలో ‘కోవిడ్‌ కారణంగా ఎన్నికలు చాలాకాం వాయిదాపడితే…అంతకాలం నిబంధనావళిని అమల్లో ఉంచుతారా? అదెలా సాధ్యం? పాల‌న ఏమి కావాలి’ అని సూటిగానే ప్రశ్నించారు. ఇటువంటి ఆసక్తికరమైన అంశాలె చర్చకు వచ్చాయి. కొన్ని పత్రికు కోర్టు హాలులో జరిగిన ఈ సంభాషణనూ రిపోర్టు చేశాయి.

సాధారణంగా కోర్టు హాలులో జరిగే సంభాషణను, న్యాయమూర్తుల‌ వ్యాఖ్యన్నీ తీర్పులో రాయరు. వాదన సందర్భంగా న్యాయమూర్తులూ తమ అభిప్రాయాల‌ను వ్యక్తం చేస్తుంటారు. ప్రశ్నిస్తుంటారు. నిర్ధారణలు చేస్తుంటారు. ఆ విషయానే వైసిపి నేతలు చెబితే…తీర్పును వక్రీకరిస్తున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. ఆయన చాలా తెలివిగా తీర్పులోని అంశానే చూపిస్తూ మాట్లాడారు. కోర్టు హాలులో జరిగిన వాదనలు, వ్యాఖ్య జోలికి వెళ్లలేదు.

సాధారణంగా వాదులు ఏ విషయంలో న్యాయం కోరారో ఆ విషయానికి సంబంధించి మాత్రమే తీర్పులో రాస్తారు. అంతేతప్ప అక్కడ జరిగిన ప్రతి మాటనూ రాయరు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. అయినా…కోర్టు హాలులో జరిగిన ఆసక్తికర వ్యాఖ్యలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘ఎన్నికలు వాయిదే వేసేముందు ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని కోర్టు ప్రశ్నిస్తున్నారు. ఆ మాట తీర్పులో ఎక్కడుందండీ’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తీర్పులో లేకున్నా న్యాయమూర్తులు ఆ అంశంపైన నిర్ధిష్టమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, ఎదుటివారిదే తప్పు అని చెప్పారు.

ఇక మీడియా విషయానికొస్తే….ఎన్నోసార్లు న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకమాట అంటే, ఆ మాటనే పతాక శీర్షికు ఎక్కించాయి మన పత్రికలు. స్థానిక ఎన్నిక తీర్పు విషయంలో మాత్రం తీర్పులోని అంశాను మాత్రమే రాసి, కోర్టు హాలులో న్యాయమూర్తు చేసిన వ్యాఖ్య జోలికి వెళ్లలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*