సుప్రీం కోర్టు సముచిత తీర్పు..! వైసిపికి మేలు కలిగించే నిర్ణయమే…!

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు సముచితమైన, సమంజసమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం తరఫున కాపాడుతూనే, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించేలా తీర్పు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను‌ ఆరు వారాలు వాయిదా వేయడాన్ని…సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపైన బుధవారం సుప్రీంలో విచారణ జరిగింది.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే స్వేచ్ఛను ఎన్నికల సంఘానికి ఇస్తూనే…అప్పటి దాకా నియమావళిని సడలించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో 26 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ వంటి పథకాలను కొనసాగించే అవకాశం ప్రభుత్వానికి‌ లభించింది.

కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎన్నికల‌ సంఘం ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. ఎన్నికలు నిర్వహించడం గానీ, వాయిదా వేస్తే ఆ మేరకు అప్పటిదాకా నియమావళిని సడలించడంగానీ చేయాలన్నది ప్రభుత్వ‌ అభిమతం. ఎన్నికలు ఎంతకాలం వాయిదా పడితే అంతకాలం నియమావళి అమల్లో ఉంటే…ప్రభుత్వ కార్యకలాపు స్తంభించిపోతాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సుప్రీం సముచిత నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వల్ల ప్రభుత్వానికి మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే…25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బృహత్ కార్యక్రమం పూర్తయితే…ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. ఆరు వారాల తరువాత ఎన్నికలు జరిగినా అధికార పార్టీకే ఎక్కువ ప్రయోజనం ‌చేకూరుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*