సూటిగా సుత్తిలేకుండా…సంక్షిప్త వార్తలు (26.05.2020)

టీటీడీ ఆస్తుల విక్రయం నిలిపివేత : తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు విక్రయం వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. భూముల విక్రయాన్ని ఆపివేయాలని ఆదేశిస్తూ జీవో జారీ చేసింది. ఈ ఆస్తులను మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించుకోడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించింది.

మేనిఫెస్టోలో 90% హామీలు పూర్తి : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టో లోని 90% హామీలను పూర్తిచేశామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా మేధోమథనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఏపీలో 99 కరోనా కేసులు : ఆంధ్రప్రదేశ్లో సోమవారం 99 మందికి సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న వారు 44 మంది కాగా విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2896 చేరింది. ఇక దేశంలో సోమవారం ఒక్కరోజే 6970 ఏడు కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి లక్షా 30వేల 848 కేసులయ్యాయి.

అమరావతి కి చేరుకున్న చంద్రబాబు : ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల అనంతరం అమరావతికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు. మార్గమధ్యంలో టిడిపి శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి.

శ్రీశైలం ఆలయంలో భారీ అవినీతి : దర్శనం అభిషేకం టికెట్ల నగదును దారి మళ్లించడం ద్వారా శ్రీశైల క్షేత్రంలో 1.42 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఈవో నే ప్రకటించారు. బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ పై పనిచేసే ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. దీని పైన విచారణ కొనసాగుతోంది.

శ్రీవారి లడ్డూల విశేష స్పందన : వివిధ జిల్లా కేంద్రాల్లో విక్రయిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూలకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే 2.40 లక్షల లడ్డూలను విక్రయించారు. ఒక్కో లడ్డూను 25 రూపాయలకు అమ్ముతున్నారు.

ఆ పది మందిని చంపింది ఒక్కడే : వరంగల్ జిల్లాలో ఓ పాడుబడిన బావిలో కనిపించిన మృతదేహాల విషయంలో మిస్టరీ వీడింది. హత్యకు గురైన పది మందిని చంపపిందీ ఒక్కడే. ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంజయ్ అనే యువకుడు ముందుగా అస మహిళను చంపాడు. ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు మిగిలిన తొమ్మిది మందిని హత్య చేశాడు . అందరికీ నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అనంతరం బావి లో పడేశాడు.

హాకీ దిగ్గజం బల్బీర్ కన్నుమూత : భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన బల్వీర్ సింగ్ (95) సీనియర్ సోమవారం కన్నుమూశారు. ఆయన హయాంలో భారత్ మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ గెలిచింది.‌ ఆయన మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు.

ప్రారంభమైన విమాన సర్వీసులు : దేశంలో సోమవారం నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయి. తొలిరోజు 532 దేశీయ విమానాలు ఎగిరాయి. వీటిలో 39 వేల 230 మంది ప్రయాణించినట్లు విమానయాన శాఖ తెలిపింది. వాస్తవంగా సోమవారం 1050 సర్వీసులు నడవాల్సి ఉంది. మార్గదర్శకాలు సవరించడంతో చాలస విమానాలు రద్దయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*