సూటిగా సుత్తి లేకుండా…సంక్షిప్త వార్తలు (27.05.20)

హైకోర్టు ఆగ్రహం : హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 49 మందికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇందులో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్్ణ మోహన్, వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

జూమ్ లో‌మహానాడు : తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనుంది. 14,000 మంది ఈ సమావేశం ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణతో సమ న్యాయం : శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీళ్లు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు అందించేలా ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామని, దీనివల్ల తెలంగాణతో సమన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మన ప్రభుత్వం మీ సూచన కార్యక్రమంలో భాగంగా నిన్న వ్యవసాయరంగం, ప్రాజెక్టుల గురించి ఆయన మేథోమధనం నిర్వహించారు.

రికవరీ లో తెలుగు రాష్ట్రాలు బేష్ : కరోనా నుంచి కోరుకున్న వారి సంఖ్య జాతీయస్థాయి కంటే తెలుగు రాష్ట్రాల్లో మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 46.6 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో 63.79 శాతం, తెలంగాణలో 64.49 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఇరవై శాతం అదనం.

ఏపీలో 95 మందికి వైరస్ : రాష్ట్రంలో మంగళవారం మరో 97 మందికి కరోనా వైరస్ సోకింది. వీరులో పలు జిల్లాలకు చెందిన 45 మంది, వివిధ దేశాల నుంచి వచ్చిన 49 మంది ఉన్నారు. దీంతో ఏపీలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,983 కి చేరింది.

బిజెపి దీక్షలు : తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయానికి ప్రతిపాదనకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టింది. భవిష్యత్తులోనూ దేవాలయ భూములను విక్రయించబోమని ప్రభుత్వం ప్రకటించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో దీక్ష చేపట్టారు.

భూముల వేలం బృందాల రద్దు : టీటీడీ వేలం ద్వారా నిర్వహించాలనుకున్న భూములకు సంబంధించి ఏర్పాటు చేసిన బృందాలను టిటిడి రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల అమ్మకాలు ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ ఈ చర్యలు చేపట్టింది.

వలస కార్మికులకు ఉచిత వసతి, సదుపాయాలు కల్పించాలి : లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు సైకిల్ పైన, కాలినడకన వెళుతున్న వలస కార్మికులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని, వారిని‌ ఉచితంగా స్వస్థలాలకు చేర్చాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*