సేవాభావం ప్రతిఒక్కరు అలవర్చుకోవాలి : యువజన సేవాసమితి అధ్యక్షుడు సురేష్

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకుని ఇతరులకు సహాయ సహకారాలు అందించాలని గంగలపూడి యువజన సేవా సమితి అధ్యక్షుడు చేమూరు సురేష్ పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని పేదలకు, వృద్ధులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ ముద్దు క్రిష్ణమనాయుడు దుస్తులు విరాళంగా అందజేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాసమితి అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ పేదలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే సేవాసమితి ఏర్పాటు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా గ్రామపెద్దలు పాల్గొని సేవాసమితికి సహకారం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. సమితి ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించనున్నట్లు తెలిపారు. దుస్తులు విరాళంగా అందజేసిన ముద్దుకృష్ణమ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్దు క్రిష్ణమనాయుడు మాట్లాడుతూ గంగలపూడి సేవాసమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. గ్రామానికి ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతిగ్రామంలో ఇలాంటి సేవా సంస్థలు ఏర్పాటు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు శేఖర్, పవన్, అనిల్, హరీష్, గ్రామ పెద్దలు వళ్లు శ్రీహరిబాబు, వి.శ్రీనివాసులు, ఎ. శ్రీనివాసులు, స్థానికులు కర్నూలు ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*