సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికీ హెల్మెట్‌ లేదంటూ ఫైన్‌..!

ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు హెల్మెట్‌ ధరించాలన్న నిబంధనను అన్ని రాష్ట్రాల రవాణా శాఖలూ అమల్లోకి తెస్తున్నాయి. అయితే ఇది కొన్నిచోట్ల అమలవుతోంది…ఇంకొన్ని చోట్ల సరిగా అమలు కావడం లేదు. కోర్టులు జోక్యం చేసుకుని ఆదేశిస్తున్నా హెల్మెట్‌ నిబంధన అందగా ఆచరణలోకి రావడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దీన్ని పక్కనపెడితే… సైకిల్‌పై వెళున్న వ్యక్తికీ హెల్మెట్‌ లేదంటూ ఫైన్‌ విధించారు కేరళ పోలీసులు. అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ పోలీసులపై విచారణ జరుగుతోంది.

ఓ దినసరి కూలీ సైకిల్‌పై వెళుతుండగా కాసర్‌గోడ్‌లో పోలీసులు అతన్ని ఆపారు. ‘నువ్వు వేగంగా వెళుతున్నావ్‌…పైగా తలకు హెల్మెట్‌ కూడా ధరించలేదు…రూ.2000 ఫైన్‌కట్టు’ అంటూ గద్దించారు. తాను అంత డబ్బులు కట్టలేనని వేడుకోవడంతో ఆఖరికి రూ.500 ఫైన్‌తో సరిపెట్టారు. తీరా అతనికి ఇచ్చిన రసీదులో ఎవరో మహిళకు చెందిన స్కూటర్‌ వివరాలు ఉన్నాయట.

అత్యంత అసంబద్ధంగా ఉన్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను అతను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వైరల్‌ అయింది. కేరళ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు…దీనిపై విచారణ జరిపిస్తున్నారట. సాధారణంగా కేరళ ప్రజలు చైతన్యవంతులు. ఇటువంటివి అక్కడ చెల్లవు. అయినా పోలీసులు ఎందుకు ఇలా చేశారో అర్థంకావడం లేదని నెటిజట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*