సైకిల్ దిగుతున్న ఆనం!

అయిష్టంగానే తెలుగుదేశంలో చేరిన నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీని వీడే స‌మ‌యం ఆస‌న్న‌మ‌యిన‌ట్లుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రాజకీయ గమనంపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెదేపాను వీడి వైకాపాలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాలో ఇంక ఇమడలేమని, వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారి తీసిన కారణాలు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు తేల్చి చెప్పారు. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. ఆయ‌న వైసిపిలో చేరే అవ‌కాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఆనం కుటుంబానికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ల‌భించ‌లేదు. ఒక‌వైపు సోమిరెడ్డి, మ‌రోవైపు నారాయ‌ణ‌లు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకుని హ‌ల్ చేస్తుండ‌గా….ఆనం ఏ ప్రాధాన్య‌తా లేకుండా ఉండిపోయారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. అందుకే ఆయ‌న పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి అనారోగ్యంతో ఇటీవ‌లే మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*