సొంత నిధులతో స్వర్ణముఖి నది ప్రక్షాళన…శ్రీకాళహస్తిలో స్నేహితులు దాతృత్వం


ధర్మచక్రం. శ్రీకాళహస్తి

గత 40 ఏళ్ళుగా ఎవ్వరూ పట్టించుకోని స్వర్ణముఖి నది ప్రక్షాళనకు పూనుకున్నారు ఇద్దరు స్నేహితులు. సొంత నిధులు వెచ్చించి గత రెండు రోజులుగా నదిలో పనులు చేయిస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు.


శ్రీకాళహస్తి పట్టణానికి ఆనుకుని ఉన్న స్వర్ణముఖి నది పేరుకే స్వర్ణం గాని పిచ్చి మొక్కలు, చెత్త కుప్పలు, రాళ్ళు రప్పలతో నిండుకుని ఉండేది. నదికి ఆనుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం ఉన్నా ఆలయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు స్తెతం పట్టించుకోలేదనే విమర్శ లు ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా తాత్కాలికంగా స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం తదుపరి వదిలేయడం పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉంటున్న బోనుపల్లికి చెందిన వెంకటక్రిష్ణమ నాయుడు, కడపజిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన సుబ్రహ్మణ్యం… నది ప్రక్షాళనకు పూనుకున్నారు. రెండు రోజులు గా నదిలో మొక్కలు తొలగించడం, చదునుచేయించే పనులు చేపడుతున్నారు. ఆలయం సమీపం నుంచి కన్నలికాలువ వరకు నదిలో పనులు చేయించనున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజులు వరకు పనులు కొనసాగతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రక్షళన పనులు పూర్తయితే నది సుందరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*