స్టామినా లేని ‘ఆఫీసర్’

రాంగోల్ వర్మ దర్శకత్వ ప్రతిభకు పరీక్షగా వచ్చిన ఆఫీసర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అగ్ర హీరో నాగార్జున కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం అక్కినేను అభిమానిలను తీవ్ర నిరాశపరిచిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో వర్మ ఇటువంటి పూర్తిస్థాయి సినిమా తీయలేదు. వెబ్ సీరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు వంటి వాటికే పరిమితం అయ్యారు. వర్మ ఇటువంటి చిత్రాలు తప్ప కమర్షియల్ చిత్రాలు తీయలేరన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన శివ హీరో నాగార్జునను ఒప్పించి ఆఫీసర్ తీశారు. సినిమా బాగా తీయకుంటే నన్ను తన్ను అను కూడా చెప్పారట వర్మ. ఈ విషయాన్ని చెబుతూ తన్నాల్సిన అవనరం పడకుండా చిత్రాన్ని బాగా తీశారని నాగార్జున వర్మకు కితాబు ఇచ్చారు.

అయితే….సినిమా ఆ స్థాయిలో లేదు. ముంబయి మాఫియా నేపథ్యంలో కథ ఇది. మాఫియా ను అంతం చేసిన నారాయణ్ పసారి అనే పోలీస్ అధికారి తనే ఒక మాఫియా డాన్ లాగా మారి అరాచకసలకు పాల్పడుతుంటారు. ప్రజల్లోనూ, పోలీస్ డిపార్టుమెంటులోనూ ఆయనకు మంచిపేరు ఉంటుంది. అయితే…కొన్ని హత్యలకు సంబంధించి నారాయణ్ పసారిపై విచారణ జరపాల్సిందిగా ముంబయి హైకోర్టు ఆదేశిస్తుంది. ఇందుకోసం హైదరాబాదుకు చెందిన ఐపిఎస్ అధికారి శివాజీ రాజ్ ..నాగార్జున ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారిగా నియమితులవుతారు. తన విచారణలో నారాయణ్ పసారినే అండర్ వరల్డ్ వ్యవహారాలు నడుపుతున్నట్లు గుర్తిస్తారు శివాజీ రాజ్. నారాయణ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబడతారు. అయితే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఓసారి బయటపడి మళ్లీ పోలీస్ అధికారి అవుతారు. కొత్తగా తయారైన మాఫియా కంపెనీని అంతం చేయడానికి పసారియాని ప్రభుత్వం నియమిస్తుంది. ఎవరయితే ముఠాను నడుపుతున్నారో ఆయనే దాన్ని పట్టుకునే అధికారి అవుతారు. ఈ టీకలో నాగార్జున ఇక సభ్యుడు అవతారు. నాగార్జనే కొత్త ముఠా నాయకుడిగా నమ్మించి అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తాడు. నాగార్జనకు ఒక కూతురు ఉంటుంది. ఆమెను నారాయణ్ నుంచి కాపాడుకోవడం కూడా ఒక టార్గెట్ గా ఉంటుంది. ఆఖరికి నాగార్జున మాఫియా ఆట కట్టించారన్నది తెరపై చూడాలి.

ఒక్క సన్నివేశంలోనుఇ హీరోను బలంగా చూపించలేకపోయారు. హీరో పారిపోవడం కూడా ప్రేక్షకులకు నచ్చదు. కథ చాలా బలహీనంగా ఉంది. వర్మ గత చిత్రాలతో పోల్చితెర మాఫియా వ్యవహారాలూ అంత బాగా చూపించలేక పోయారు. ఇది వర్మ సినిమానే అనే అనుమానం కలుగుతుంది. కూతురు సెంటిమెంట్ ప్రేక్షకులను కొంత సినిమాలో ఇన్ వాల్వ్ చేస్తుంది. ఫైట్స్ కూడా వర్మ చిత్రాల్లో లేవు. నేపథ్య సంగీతం, కెమెరా ఫర్వాలేదు. సినిమా నిడివి 1.40 గంటలు మాత్రమే. మొత్తంగా వర్మ ఆఫీసర్ అంత స్టామినాగా కనిపించలేదు. నాగరికత అభిమానులు వర్మను తన్నరు. అలాగని తలమీదనించి పెట్టుకోరు. ఇంతే వర్మ ఆఫీసర్ సామర్థ్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*