స్థానిక‌ ఎన్నికలకు సిద్ధంకండి…టిడిపి నేతలు

స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని తొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మురళి నాయుడు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందామని కార్యకర్తలు బాధపడకూడదన్నారు. గెలుపు ఓటములు సహజమే అని చెప్పారు. విజయానికి…ఓటమి తొలిమెట్టు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. స్థాఇక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మండలంలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు పోతుగుంట గురయ్యనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. అయితే వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయంతో జనం ఆ వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమికి కూడా అదే కారణమన్నారు. ఓటమితో దిగులు చెందకుండా మరింత పట్టుదలతో కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్నివేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు వేణు, భాస్కర్ నాయుడు, రామకృష్ణ నాయుడు, శంకర్ నాయుడు, చంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

  • ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*