స్థానిక ఎన్నికలు ఆరు వారాలు వాయిదా…ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. !

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో నామినేషన్లు పూర్తయ్యాయి. ఇక పోలింగ్ మాత్రం జరగాల్సి ఉంది. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయితే ఈరోజు నుండి‌ జరగాల్సిన మిగిలిన ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాబోదని, దీని కొనసాగింపు మాత్రమే వాయిదా వేస్తున్నామని వెల్లడించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*