స్విమ్స్ ఆస్పత్రికి మహర్దశ… రూ.100 కోట్ల కేటాయించిన టిటిడి

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది. ఈ ఆసుపత్రిని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. స్విమ్స్ ఆసుపత్రిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇదిలావుడగా 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను టీటీడీ పాలక మండలి ఈరోజు ఆమోదించింది. ఇందులో స్విమ్స్ ఆసుపత్రికి ఏకంగా రూ.100 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించింది 24 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లలో రూ.40 కోట్లు భవనాల నిర్మాణానికి, రూ.60 కోట్లు ఆసుపత్రి నిర్వాహణను ఖర్చు చేయనున్నారు. ఆస్పత్రి నిర్వహణ కోసం గత ఏడాది కన్నా 3 రెట్లు అదనంగా కేటాయించారు. అవసరమైన వైద్య వైద్య పరికరాలు కొనుగోలు చేయడం భవనాలు నిర్మించడం వంటివాటికి రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏదిఏమైనా టిటిడి ఆధీనంలోకి తీసుకోవడం వల్ల స్విమ్స్ ఆసుపత్రి దశ తిరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*