హెచ్.సి.ఎల్. కంపెనీని అమరావతికి తరలించి తిరుపతికి అన్యాయం

శ్రీవారి భక్తుడైన శివనాడార్ తన హెచ్.సి.ఎల్. కంపెనీని తిరుపతిలో స్థాపించాలనుకుంటే ..ప్రభుత్వ పెద్దలు అడ్డుపడి అమరావతికి తరలిచి రాయలసీమకు అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.

అమరావతిని విశ్వనగరంగా రూపొందిస్తామంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం…గొప్పలు చెప్పుకోవడం కోసం ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తాను హెచ్.సి.ఎల్ కంపెనీని తిరుపతి లోనే ఏర్పాటు చేస్తానని మొత్తుకున్నా ప్రభుత్వం అంగీకరించలేదని అన్నారు. ఆ కంపెనీ తిరుపతిలో ఏర్పాట యివుంటే సీమ జిల్లాల వారికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జన చైతన్య వేదిక తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజయ్ కల్లాం మాట్లాడారు. ఆయన ప్రభుత్వ తీరుపైన సునిశితమైన విమర్శలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఇక్కడ సంపాదించిన అవినీతి డబ్బుతో కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకూ డబ్బు పంపే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయం కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. నాటకాలతో డ్రామాలతో కాలం గడచిపోతోందని ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*