వెంక‌టేశ్వ‌ర స్వామి కంటే నేనేమి త‌క్కువ అనుకున్నారేమో..!

మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీనులయ్యే సింహాసనం వంటి ఆసనానికి అటూ ఇటూ శంఖు చక్రాలు ఏర్పాటు చేయడాన్ని కొందరు శ్రీవారి భక్తులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ధరించే శంఖు చక్రాలను సామాన్య మానడైన ఓ స్వామీజీ తన సింహాజనానికి అలంకరణగా ఏర్పాటు చేసుకోవచ్చా…అని ప్రశ్నిస్తున్నారు. ఆయన తీరుకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ కొన్ని ప్రశ్నలతో కూడిన పోస్టు ఒకటి క‌నిపించింది. అందులో ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

– శ్రీ మన్నారాయణునికి సంబంధిచిన ఈ చిన్హములైన‌ శంఖు, చక్రములను ధరించటానికి ఈయ‌న‌కు ఏ అధికార‌ముంది? ఇది భగవంతుడికి ద్రోహంకాదా?
– ముందర ఆశ్రమము అన్నారు. ఆతరువాత ఏకంగా పీఠం అనేసారు. అసలు పీఠాలు (దత్త పీఠం అని) పెట్టే అధికారం ఎవరు ఇచ్చారు..?
– అసలు వీరు బ్రహ్మచారా? గృహస్థు (కాదు)నా? వానప్రస్థా …? సన్యాసా…?
– అవధూత అని చెప్పుకుంటున్నారు. మరి అవధూత లక్షణాలు ఏమిటి? వీరు చేస్తున్నది ఏమిటి?
– సనాతన ధర్మానికి సంబంధిచి ఈ యనది ఏ ఆశ్రమము..?
– పరంపర అంటారు. అసలు ఏ పరంపరా లేని వీరికి సొంత పరంపరలను సృష్ఠించే అధికారం ఎవరిచ్చారు?
– త‌ర‌చూ యన విదేశీ యాత్రలు చేస్తారు. సంన్యాసి విదేశీయాత్రలు చేయకూడదు. అసలు ఈ యన ఎవరో ఏ మిటో అగమ్య గోచరం. ధర్మము ధర్మము అంటారు ఈ యనకి తెలియదా విదేశాలు వెళ్ళకూడదని ? అడగండి ఆయనని….ఎందుకు విదేశాలు వెళుతున్నారని.?
అంటూ ప్ర‌శ్న‌లు ఎక్కుపెట్టారు. మిగ‌తా విష‌యాల సంగ‌తి ఎలావున్నా…ఒక పీఠాధిప‌తి కూర్చునే సంహాస‌నానికి శంఖు చ‌క్రాల‌ను అలంక‌ర‌ణ‌గా అమ‌ర్చుకోవ‌చ్చా? అనేదే ధ‌ర్మ‌చక్రం అనుమానం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*