16న టిడిపికి ఎస్.సి.వి. గుడ్ బై..!

శ్రీకాళహస్తి టిడిపి టికెట్టు ఆశిస్తున్న ఎస్.సి.వి.నాయుడికి ఆశా భంగం కలగడంతో ఆయన ఈనెల 16 న తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.

శ్రీకాళహస్తి టికెట్టు ఎస్.సి.వి., సుదీర్ రెడ్డి లలో ఎవరికి ఇవ్వాలనేదానిపై సర్వే చేయించారు. ఇందులో ఎస్.సి.వి నాయుడికే‌ అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఎస్.సి.వి. వైపే మొగ్గినట్లు సమాచారం. అయితే లోకేష్ తో ఉన్న సంబంధాలు రీత్యా సుధీర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్తితులలో ఇక టిడిపిలో కొనసాగొద్దని ఎస్.సి.వి.పై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు శ్రీకాళహస్తి తో పాటు సత్యవేడు, సూళ్ళూరుపేట, వెంకటగిరి నియోజక వర్గాల్లోనూ బలమైన అనుచరవర్గం ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని అనుచరులతో ఈ నెల 16 న ఎస్.సి.వి. సమావేశం కానున్నారు. ఆ రోజే మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారు. అందుకే ఆరోజు తమ నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా సన్ స్ర్టోక్ వల్ల చంద్రబాబు నాయుడు నాలుగు నియోజకవర్గాల్లో భారీమూల్యం చెల్లంచే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*