24 గంటలు – 3.24 కోట్లు ? దటాజ్‌ రజనీకాంత్‌!

రజనీకాంత్‌…సంచలనాలకు మారుపేరు. ఆయన సినిమాలు బాక్సీఫీసును బద్ధలుగొడతాయి. కలెక్సన్లు కొల్లగడతాయి. రికార్డుల మోత మోగిస్తాయి. రెండున్నర గంటల సినిమానే కాదు రెండున్నర నిమిషాల టీజరూ అంతే సంచలనం. రజనీకాంత్‌తో శంకర్‌ సృష్టిస్తున్న 2.0 చిత్ర టీజర్‌ విడుదలయింది. 24 గంటల్లో యుట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 3.24 కోట్ల మంది దాన్ని చూశారట. ఒక్క తెలుగులోనే 60 లక్షల మంది టీజర్‌ను చూశారు. దీన్నిబట్టి ఆయన సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నవంబర్‌ 29న విడుదలకు సిద్దమైన సినిమా చిత్రీకరణ చాలా రోజులుగా సాగుతోంది. రోబోకు సీక్వెల్‌గా వస్తున్న 2.0పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్నాయి. ఆయితే చిత్రీకరణ ఆలస్యమవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. టీజర్‌ విడుదలతో మళ్లీ ఒక్కసారిగా ఆశలు రేకెత్తాయి. అంచనాలూ అంతకంతకూ పెరిగిపోయాయి. రోబో చిత్రంలో చిట్టి చేసిన హంగామా తెలిసిందే. 2.0లో రోబోకు మించిన గ్రాఫిక్స్‌ ఉన్నాయని టీజర్‌లోనే అర్థమైపోయింది. ఇటీవల విడుదలైన రజనీకాంత్‌ కాలా నిరుత్సాహపరిచిన నేపథ్యంలో అభిమానులు 2.0 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*