4.37 కిలోల బంగారు…10,438 చెప్పులు, దుస్తులు…ఇవన్నీ ఏమిటో తెలుసా..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత మరణానంతరం అమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. జయలలితకు వారసులెవరూ లేకపోవడంతో…ఆమె నివాసమైన చెన్నై లోని‌ పోయేస్ గార్డన్ ను, ఆ ఇంట్లోని వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏయే వస్తువులు స్వాధీనం చేసుకున్నారో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

బంగారు 4.370, కిలోలు వెండి 601.42 కిలోలు, చిన్నపాటి వెండి వస్తువులు 162, టీవీలు 11, ఫ్రిడ్జిలు 10, ఏసీలు 38, ఫర్నిచర్ 556, వంటగది వస్తువులు 6514, అలంకరణ వస్తువులు 1055, వివిధ రకాల వస్త్రాలు, పాదరక్షలు 10,438, సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు 29, వంటగది ఎలక్ట్రికల్ వస్తువులు 571, పుస్తకాలు 8,376, జ్ఞాపికలు 394, సూట్కేసులు 65, కాస్మోటిక్ వస్తువులు 108… ఇలా మొత్తం 32,721 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*