మోడీపై భలే పిట్ట కథలు!

గంభీరంగా రొమ్ము విరుచుకుని అందరిపైనా విరుచుకుపడే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎద్దేశా చేస్తూ సోషల్‌ మీడియాలో పిట్టకథలు షికారు చేస్తున్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా దీక్ష చేపడతానని ప్రకటించినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆయనపై సెటైర్లే సెటైర్లు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఏం చెప్పారంటే….ఒక రోగి ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అతని గురించి డాక్టరు పట్టించుకోలేదు. చివరికి రోగి మరణించాడు. కుటుంబ సభ్యులంతా ఆ డాక్టర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఆస్పత్రి బయట ధర్నా చేస్తున్నారు. కనీసం క్షమాపణ కూడా చెప్పని ఆ డాక్టరు….అతి తెలివికి పోయారు. ఆస్పత్రిలో పరిస్థితిలు తనకు మనస్తాపం కలిగించాయని, తానూ దీక్ష చేపడతానంటూ ఆస్పత్రి బయటే దీక్షకు కూర్చున్నారు’ ఇదీ నాగేశ్వర్‌ చెప్పిన పిట్టకథ. ఇలావుంది నరేంద్ర మోడీ వ్యవహారం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తల్లిదండ్రులను చంనిన ఓ క్రూరుడికి కోర్టులో జడ్జి మరణ శిక్ష విధించారు. ఆ శిక్షణు అమలు చేయబోయే ముందు నీ చివరి కోరిక ఏమిటని జైలులో అడిగారు. దానికి ఆ నేరస్తుడు తెలివిగా….’తల్లిదండ్రులు లేని అనాథను దయపెట్టి నన్వు విడిచేయండ’ అని అడిగాడంట. ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సిన నష్టమంతా చేసి, పార్లమెంటులో అన్నాడిఎంకే ఎంపిలతో రగడ చేయించి, సభను జరగనీకుండా అడ్డుపడిన మోడీనే….ఆఖరికి సభ సరిగా జరగలేదనే పేరుతో దీక్ష చేస్తున్నారు. మోడీ వ్యవహారం తల్లిదండ్రులను చంపి తనను విడిచిపెట్టమన్న నేరస్తునిలా ఉందనే కామెంటు విస్తృతంగా పెడుతున్నారు. అదేవిధంగా ‘ఆస్కార్‌కు మించి అవార్డు ఏదైనా ఉంటే మోడీకి వెంటనే ఇవ్వండి’ అంటూ మోడీ కపట నాటకాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాపం, మోడీ రోజులు తిరగబడినట్లున్నాయి. ఏంచేద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*