టైలర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్స్ లకు వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్స్ లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తి పట్టణ ప్రాంతంలో కరోనామహమ్మారి చెన్నైలోని కోయంబేడు కూరగాయల వల్ల మరోసారి విజృంభణ చేసే అవకాశాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, దీంతో మరోమారు
పేదప్రజలు ఆకలి కేకలతో బాదపడే దాఖలాలు కొట్టొచ్చినట్లు ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ సమయంలో టైలర్ ఎవరు వారి షాపులు తెరవకపోవడంతో వారికి
ఒకపూట ఇల్లు గడవడమ కష్టమయిిింది. దీంతో తన వంతు సహాయంగా ఆకలితో అలమటిస్తున్న టైలర్లకు వైకాపా చిత్తూరుజిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు,

ఈ కార్యక్రమంపై ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…
తన మిత్రుడు వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో , నేడు తను శ్రీకాళహస్తి టైలర్ యూనియన్ అస్సోసియేషన్ లోని టైలర్స్ అందరికీ 170 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కూరగాయలు బిస్కెట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప కార్యక్రమాన్ని అంజూరు శ్రీనివాసులు సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. తమ నాయకులు చేస్తున్న ఇలాంటి మహత్తరమైన సేవలను అరికట్టాలని కావాలనే కొందరు తమపై బురద రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి చీప్ రాజకీయాలు ఇకనైన మానుకొని ఎవరు అయినా సరే ఏ పార్టీ అయినా సరే పేదవాని ఆకలిని అర్థం చేసుకొని పట్టెడన్నం పెట్టవలసిందిగా నియోజకవర్గంలో నాయకులను కోరారు,

అనంతరం వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ…
దేశంలో లాక్ డోన్ ప్రభావితం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కూలినాలికి వెళ్ళకుండా ఒక్కపూట వారి కుటుంబలు గడవడమే కష్ట సాధ్యం అవుతుందని , తనవంతు ఉడతా భక్తి సహాయంగా శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్ లకు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశానని, మేము పంపిణీచేసిన నిత్యఅవసరసరుకులతో వారి కుటుంబీకులు కొద్ది రోజులైనా వాళ్ళ పట్టెడన్నం పెట్టే సదవకాశం ఆ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు తనకు కల్పించారని, ప్రజలు మరికొద్ది లాక్ డోన్ నిబంధనలు పాటించి ఇంటి నుంచి బయటకు రాకుండా తగు రక్షణ వలయంలో ఉండి తమను తాము కాపాడుకుంటూ పక్క వారిని కూడా కాపాడాలి అంటూ ఆయన ప్రజలను అర్ధించారు.

ఈ కార్యక్రమంలో …టైలర్స్ యూనియన్ నాయకులు …
చాన్ బాష , శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, బాబు, రాజా, నాగభూషణం, కోటి, కర్ణ , తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*