ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గరిమెళ్ళ విజయ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం స్థానిక పెండ్లిమండపం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి నేతలు, కార్యకర్తలు పైన దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయన్నారు. గురువారం తిరుపతిలో చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర కు శాంతియుతంగా వెళుతున్న టిడిపి నేతను దౌర్జన్యం గా ఆపి ,అరెస్ట్ చేయడం దారుణమన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తే సహించమన్నారు. దౌర్జన్యాలతో పోరాటాలను ఆపలేరన్నారు. ఓటుతోనే వైసీపీ కి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు దశరదాచ్చారి, చెంచయ్యనాయుడు ,కంఠా రమేష్, కామేష్ యాదవ్, గాలి మురళీనాయుడు, చక్రాల ఉష ,రెడ్డివారి గురవారెడ్డి,ప్రకాష్ నాయుడు, పోలూరు శ్రీనివాసులురెడ్డి, మిన్నల్ రవి పలువురు నేతలు పాల్గొన్నారు.