పోలీస్ కావాల్సిన వాడిని పొలిటీషన్ అయ్యానని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి అన్నారు. పోలీస్ వ్యవస్థతో తనకు ఆత్మీయత, అవినాభావ సంబంధం ఉందని అన్నారు. బుధవారం తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన పోలీస్ మీట్ కు చెవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. చెవిరెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
పోలీస్ వ్యవస్థతో నాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎలాగంటే.. కొత్త డాక్టర్ కంటే పాత రోగి నయం అన్నట్లుగా.. పోలీస్ లకు నేను పాత పేషెంట్ లాంటి వాడిని. ఏదో మధ్యలో రాజకీయాల్లో వచ్చిన సంబంధం కాదు. విద్యార్థి దశ నుంచే పోలీస్ వ్యవస్థతో అటాచ్మెంట్. విద్యార్థిగా ఉన్నప్పుడు రాడికల్ ఉద్యమాల్లో ఉండే వాడిని. అనేక ఎన్నికల్లో పీడీఎస్ తరపున పోటీ చేసేవాడిని. ఇలా పోరాటాలతో ఉన్న నన్ను.. మా నాన్నకు సన్నిహిత మిత్రుడైన ఆంజనేయ రెడ్డి ఆ రోజు డీజీపీ గా ఉండే వారు.. నా చదువు పూర్తవగానే నన్ను తీసుకెళ్లి హైదరాబాదు ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో చేరిపించారు. ఆ తరువాత తప్పని పరిస్థితుల్లో అనివార్య కారణాల చేత ఆ కోచింగ్ మధ్యలో ఆగిపోయింది.
మూడు దశాబ్దాల పాటు విద్యార్థి రాజకీయ పోరాటాలు చేశాను. ఆకాలం గడిస్తే.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఈ పది సంవత్సరాలలో… చెబితే ఆశ్చర్య పోతారంటూ.. 70 మార్లు పోలీస్ లు అరెస్టు చేశారు.. 88 కేసులు పెట్టారు. అందుకే చెబుతున్నా.. కొత్త డాక్టర్ కన్నా.. పాత రోగి నయం అని.. పోలీస్ వ్యవస్థ పైన అవగాహన ఉంది. ఇది సైద్ధాంతిక పరమైన వైరుద్యమే తప్ప, వ్యక్తిగతమై నది లేదన్నారు. తప్పులు చేసి ఎప్పుడు పోలీస్ స్టేషన్ కు వెల్లినవాడిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేవాడిని.. ఎప్పుడు పోలీస్ వాహనం వచ్చినా భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చిందని,
ప్రభుత్వం వచ్చిన తరువాత విప్ హోదాలో మా ఇంటి వద్దకు రక్షణ నిమిత్తం పోలీస్ వాహనం వచ్చినా మా గ్రామ ప్రజల్లో రక్షణకు వస్తున్నారా.. తీసుకెళ్లడానికి వస్తున్నారా అనే ఫీలింగ్ ఉండేదన్నారు. ఇలా పోలీస్ లతో సంబంధం, ఆత్మీయత ఉందన్నారు.
- ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి